రైల్వే ప్రయాణికులకు తీపికబురు. ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ అందించింది. రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపై సులభంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్యాసింజర్లు ఇకపై ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు అందించాల్సిన పని లేదు. ఇదివరకు టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు వారి గమ్య స్థానం వివరాలు కూడా ఎంటర్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అడ్రస్ వివరాలు అందించాల్సిన పని లేదు.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఎక్కడికి వెళ్తున్నామో ఆ అడ్రస్ వివరాలను కూడా ఎంటర్ చేయాల్సి ఉండేది. ఈ వివరాలు ఎంటర్ చేయకపోతే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం సాధ్యం అయ్యేది కాదు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడే వారు. అయితే ఇకపై ఇలా చేయాల్సిన పని లేదు. ప్యాసింజర్లకు ఊరట లభించింది.
జర్నీ చేసిన వారిలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ కేసు వస్తే అప్పుడు వారిని ట్రాక్ చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడేవి. అందుకే రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో అడ్రస్ వివరాలు తప్పనిసరి చేశారు. అయితే ఇప్పుడు అడ్రస్ వివరాలు కచ్చితంగా అందించాలనే నిబంధనను తొలగిస్తూ ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రైన్ టికెట్‌ను మరింత వేగంగా బుక్ చేసుకోవచ్చు.
కాగా ఇండియన్ రైల్వేస్ కోవిడ్ 19 కారణంగా పలు రకాల ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ట్రైన్ సర్వీసులను రద్దు చేసింది. మళ్లీ క్రమక్రమంగా వీటిని పునరుద్ధరిస్తూ వచ్చింది. అలాగే ట్రైన్స్‌కు టికెట్ బుకింగ్ తప్పనిసరి చేసింది. తర్వాత ఈ రూల్ తీసేసింది. అలాగే కేటరింగ్ సర్వీసులు, బ్లాంకెట్స్ పంపిణీ వంటి వాటికి కోవిడ్ నేపథ్యంలో నిలిపివేసింది. తర్వాత మళ్లీ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మళ్లీ దాదాపుగా ట్రైన్ సర్వీసులు అన్నీ లభిస్తున్నాయి.
మరోవైపు ఇండియన్ రైల్వేస్ గురువారం రోజున 160కి పైగా ట్రైన్స్‌ను రద్దు చేసింది. ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సంబంధిత కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రైల్వేస్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈరోజున 128 ట్రైన్స్ బయలుదేరాల్సి ఉంది. అయితే ఇవి అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే 33 ట్రైన్స్ పాక్షికంగా రద్దు అయ్యాయి. బుధవారం రోజున కూడా రైల్వేస్ 183 ట్రైన్స్‌ను క్యాన్సిల్ చేసింది.