దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు.
ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు.