ఆంధ్రప్రదేశ్ లో కనీవనీ ఎరుగని ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరులోని రామకృష్ణాపురంలో ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్ పల్లి నానిబాబు, మరో డ్రైవర్ హేమ సుందర్ అలియాస్ సురేష్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. హేమ సుందర్ కు అతని భార్యకు తరచూ మనస్పర్థలు రావడం గమనించిన నాని ఏలాగైనా ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. అదేతడవుగా.. తన స్నేహితుడి భార్యను అనుభవించాలనుకున్నాడు. దీంతో హేమసుందర్ భార్యపై కన్నేసిన నాని అవకాశం కోసం ఎదురు చూశాడు. గొడవలు ఎక్కువ కావడంతో ఈ నెల 9వ తేదీన సురేష్ భార్య ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. సురేష్ ఏమో కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నాని ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మించాడు.