అందుకు పనికిరాడని విడాకులు కోరింది…భర్త ఏమి చేసాడంటే ?

Frustrated Husband sends his private videos to wife parents

తన భర్త సంసారానికి పనికిరాడని కారణాన్ని చూపుతూ కోర్టులో విడాకుల కేసు వేసిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు భర్త. తాను మరో మహిళతో ప్రైవేటు సమయంలో ఉన్న అశ్లీల వీడియోను అత్తమామలకు పంపించాడు. దీంతో ఆమె కుటుంబం ఇప్పుడు పోలీసుల దగ్గరకి వెళ్ళింది. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ నగర్‌కు చెందిన విభవసు(తమిళ మూలాలున్న హైదరాబాద్ వాస్తవ్యుడు)కు, తమిళనాడులో కొడింగ్యాయుర్‌కు చెందిన అనూషకు రెండేళ్లకిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయింది.

తన భర్తకు మగతనం లేదని అతనితో తానూ ఉండలేనని ఆమె తల్లితండ్రులకి చెబుతూ వచ్చింది. కానీ రెండు కుటుంబాల వారు భార్య, భర్తలను కలపడానికి కౌన్సెలింగ్‌లు కూడా ఇప్పించారు. ఈ క్రమంలోనే తన భర్త నపుంసకుడని తనకు విడాకులు మంజూరు చేయాలని, అనూష ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఇది తెలిసిన విభవసు మరో మహిళతో అశ్లీలంగా ఉన్న వీడియోను తీసి తాను మగాడినే అని నిరూపించుకునేందుకు అనూష కుటుంబ సభ్యులకు పంపాడు.