పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఆడియో హక్కులు సంబంధించి కొన్ని రూమర్స్ అయితే సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.’

దీనితో రాజా సాబ్ ఆడియో హక్కులు ఇంతకి అమ్ముడుపోయాయి అంతకి అమ్ముడుపోయాయి అంటూ వార్తలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ బయటకు వచ్చింది. ది రాజా సాబ్ ఆడియో హక్కులకి 15 కోట్ల ధర పలికింది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రముఖ ప్రొడ్యూసర్ మారుతీ ఫ్రెండ్ కూడా అయినటువంటి ఎస్ కె ఎన్ సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు. సో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తేలిపోయింది. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
#RajaSaab Musical Rights Acquired by
Icon music SouthFor One of the Best Price in recent times
First single Will Be Out Soon
https://t.co/DZuEqL9y6W
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) September 4, 2024