ఎన్ఆర్ఐ వేధింపులకు ఫుల్ స్టాప్… ఏ క్షణంలోనైనా.. అరెస్ట్

ప్రేమ పేరుతో ఓ ఎన్ఆర్ఐ అమ్మాయిని తీవ్రంగా వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా హైదరాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లెకు చెందిన ఓ యువతి నగరానికి చెందిన మరో యువకుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ పూర్తి చేశారు. అప్పట్లో వీరిద్దరూ స్నేహపూర్వకంగా కలిసి మెలిసి తిరిగారు. విద్యాభ్యాసం తర్వాత యువతి సిటీకి తిరిగి రాగా.. అతడు అక్కడే ఉద్యోగంలో చేరాడు. గడిచిన కొన్నాళ్లుగా ఆ యువతిని అతను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. ఆమె నిరాకరించడంతో కక్షగట్టిన అతగాడు.. వివాహం చేసుకుంటే తననే చేసుకోవాలని, లేదంటే అసలు పెళ్లే కాకుండా చేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు.

అయితే తాజాగా ఆమెపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో.. గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా ఆమె కుటుంబీకులు, బంధువులు, స్పేహితులకు పంపడం చేస్తున్నాడు. అతడి వ్యవహారం శ్రుతి మించడంతో బాధితురాలు తాజాగా టీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు న్నారై ఆస్ట్రేలియా కావడంతో అతడిపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయాలని నిర్ణయించారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపనున్నారు. దాంత అతడు  ఏ సమయంలో అయినా దేశంలోకి అడుగుపెడితే ఎల్‌ఓసీ ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వాంటెడ్‌ అని గుర్తించే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.