ప్రేమ కోసం మన హీరోలు దేనికైనా సిద్ధమవుతారు. వారు ఎలాంటి పరిస్థితులు కూడా దాటుకుని తమ ప్రేమని సాధించుకుంటారు. ఇలాంటి కథలు చాలా మూవీ ల్లో కనిపించాయి. అయితే, కొన్ని లవ్ స్టోరి సినిమా ల్లో మాత్రం ఈ ప్రేమ కోసం హీరోలు ఏకంగా దేశం సరిహద్దులు దాటారు. తాజాగా టాలీవుడ్లో తెరకెక్కిన తండేల్ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే హీరో పాకిస్థాన్ దేశంలో యాక్షన్ చేయనున్నట్లు చూపెట్టారు. దీంతో ఈ మూవీ లో హీరో దేశం సరిహద్దు దాటి తన ప్రేమని తిరిగి ఎలా సాధించుకుంటాడనేది మనకు ఈ మూవీ లో కూడా చూపెట్టబోతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే, ఈ ప్రేమ కథని దర్శకుడు చందూ మొండేటి ఎలా తీర్చిదిద్దాడనేది మనం మూవీ రిలీజ్ అయ్యాకే చూడగలం.
కాగా, ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో బాలీవుడ్లో తెరకెక్కిన ‘గదర్’ సినిమా కూడా చాలా మందికి తెలిసిందే. ఆ మూవీ లో హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఏకంగా పాకిస్థాన్‌లోని లాహోర్ వరకు వెళ్లి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పుడు ఇదే తరహా పాయింట్ తండేల్‌లో ఉండనుండటంతో టాలీవుడ్‌కి ఇది మరో గదర్ కానుందని అభిమానులు అంటున్నారు. మరి గదర్ స్థాయిలో తండేల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో అనేది చూడాలి.