‘ఆపరేషన్ వాలెంటైన్’ నుండి ‘గగనాల’ సాంగ్ ప్రోమో అవుట్ ..!

‘ఆపరేషన్ వాలెంటైన్’ నుండి ‘గగనాల’ సాంగ్ ప్రోమో అవుట్ ..!
Cinema News

యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థల పై నిర్మితం అవుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు ఏర్పరిచాయి.

విషయం ఏమిటంటే, నేడు ఈ సినిమా నుండి గగనాల అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. అర్మాన్ మాలిక్ పాడిన ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే ట్యూన్ అందించిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫుల్ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గం. 3 ని. లకు విడుదల చేయనున్నారు. కాగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ని మార్చి 1న గ్రాండ్ గా తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

వీడియో ని మీరు కూడా చుడండి : https://youtu.be/1gKVzMQCmQM