ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ : మిస్ అవ్వకుండా చుడండి

ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ : మిస్ అవ్వకుండా చుడండి
Cinema News

మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లని అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అలా తాను చేసిన మరో సరికొత్త ప్రయత్నమే “ఆపరేషన్ వాలెంటైన్”. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హద తెరకెక్కించిన ఈ మూవీ మొదటి నుంచి కూడా మంచి అవుట్ పుట్ తో వస్తుంది అనే బజ్ లో ఉంది.

మరి ఆ మధ్య వచ్చిన టీజర్ లో విజువల్స్ కూడా ఆశ్చర్యపరచగా ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అంతకు మించి ఉందని చెప్పాలి. 2019 ఫిబ్రవరి 14 న భారత సైన్యంపై జరిగిన ఒక దారుణ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కినట్టుగా ఇది వరకే కన్ఫర్మ్ కాగా మరి ట్రైలర్ లో మాత్రం దీనితో కూడిన ఎమోషన్స్ మరియు మెయిన్ గా ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

 ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ : మిస్ అవ్వకుండా చుడండి
Operation Valentine

ఎక్కడా కూడా ఒక్క షాట్ ఇది గ్రాఫిక్స్ అన్నట్టుగా అనిపించడం లేదు. ఇక రుద్రా గా వరుణ్ తేజ్ తన రోల్ లో ఇంటెన్స్ గా మరియు డైనమిక్ గా కనిపిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ మానుషి చిల్లర్ తెలుగు డైలాగ్స్ ని ఈజ్ గా చెప్పినట్టు కనిపిస్తుంది. అలాగే దర్శకుడు మన దేశపు ఎమోషన్ ని కూడా బాగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది.

వీటితో పాటుగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్, హరి కే వేదాంతం సినిమాటోగ్రఫిలు బ్యాక్ బోన్ గా నిలిచాయని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మేకర్స్ మాత్రం ఈ మార్చ్ 1న మంచి ట్రీట్ ని అందించేలా ఉన్నారని చెప్పాలి. మెయిన్ గా ఆ విమాన విన్యాసాలు మాత్రం బిగ్ స్క్రీన్స్ పై మంచి ఫీస్ట్ ఇస్తాయనిపిస్తుంది.