పరారీలో గాలి…హైదరాబద్ లోనేనట !

Gali Janardhan Reddy Missing

కర్ణాటక భారతీయ జనతా పార్టీ అనధికార నాయకుడు, మైనింగ్ డాన్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. బళ్లారి ఉపఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థి ఘోర పరాజయం పాలవుతున్న సందర్భంలోనే ఆయన పరారయ్యారు. అయితే ఇది ఓటమి అవమానంతో తల ఎవరికీ చూపించలేక కాదండోయ్ దాదపు రెండేళ్ళు జైల్లో ఉన్న తనని పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో. అదేంటి బెయిల్  ఇచ్చారుగా మళ్ళీ అరెస్ట్ చేయడం ఏమిటా అనుకుంటున్నారా ?

Janardhan Reddy

అయితే గాలి జనార్ధన్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడానికి కారణం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులతో కలిసి ఒక కేసు మాఫీ చేయడానికి ప్రయత్నించడమే. ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే బెంగుళూరులో కొన్నాళ్ల క్రితం యాంబిడెంట్ మార్కెంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి అంటూ కొన్ని స్కీములు నడిపి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ యాంబిడెంట్ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డి వద్దకు వచ్చింది. ఆయన ఈడీ కేసులు తీసేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ప్రతిగా తనకు డబ్బులు వద్దని చెప్పారు కానీ 57 కిలోల బంగారు కడ్డీలు మాత్రం తీసుకున్నారు. ఈడీ అధికారులకు రూ. కోటి లంచం ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయంబయటపడిపోయింది. సాక్ష్యాలతో సహా అధికారులకు దొరికిపోవడంతో గాలి జనార్ధన్ రెడ్డి కోసం వేట ప్రారంభించారు.

Gali Janardhan

ఈ విషయం తెలిసి ఆయన పరారయ్యారు. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరుడు అలీఖాన్‌ కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్లు ఫోన్ ట్రేసింగ్ ద్వారా తెలుసుకున్న కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌లో గాలింపు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గాలి జనార్దన్ రెడ్డికి చాలా మంది ఆత్మీయులున్నారు. ఎవరి దగ్గర అయినా ఆశ్రయం పొందుతూ ఉండిఉండవచ్చు. అయినా పోలీసుల నుంచి తప్పించుకుని గాలి జనార్దన్ రెడ్డి ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉండగలరు. ఎందుకంటే ఆయన దేశం దాటి పోలేరు పాస్ పోర్ట్ కోర్టు ఆధీనంలో ఉంది. ఎంత కాలం దాక్కున్నా దాని వల్ల మరింత చెడ్డ పేరే కానీ తప్పించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.