చరణ్‌ లుక్‌ సంతృప్తి పర్చలేదట!

Ram Charan Getting Comments On Vinaya Vidheya Ram First Look

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బోయపాటిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ దీపావళికి విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల తీరుపై మెగా ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ ఇలా విడుదల చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ప్రీ లుక్‌ అన్నట్లుగా ఉందని, ఫస్ట్‌లుక్‌ అన్నట్లుగానే లేదు అంటూ ఆగ్రహంతో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విషయంలోనే ఇలా అయితే తర్వాత తర్వాత పరిస్థితి ఏంటా అంటూ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు దక్కించుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Vinaya Vidheya Ram

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ‘రంగస్థలం’ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. అద్బుతమైన వసూళ్లను సాధించిన రంగస్థలం చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ మూవీ అనగానే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. వంద కోట్ల మూవీ అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది. కాని ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే అలా అనిపించడం లేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఫస్ట్‌లుక్‌తోనే సినిమాను అంచనా వేయడం ఎలా జరుగుతుంది. ఫస్ట్‌లుక్‌ లు బాగున్న సినిమాలన్ని ఎంతగా సక్సెస్‌ అయ్యాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఫస్ట్‌లుక్‌ విడుదల తర్వాత చరణ్‌ మూవీ గురించి పెద్ద ఎత్తున సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంను దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.