బాబు నెక్స్ట్ టార్గెట్ ఎవరబ్బా ?

Chandrababu

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బెంగళూరు వెళ్లనున్నారు. బీజేపీ నేత, ప్రధాని నరేంద్ర మోదీపై పోరాటాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎన్డీయేను అధికారం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసే పనిని తన భుజస్కంధాలపైకి తీసుకున్నారు. అందుకే ఇప్పటికే న్యూఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులను కలిసి మద్దతు అడిగిన ఆయన, నేడు కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు.

 Deve Gowda And KUMARASWAMY

బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే చంద్రబాబునాయుడు.. బీజేపీ వ్యతిరేక పార్టీలనే కలుస్తూండటంతో కొత్తగా సాధించేది ఏమిటి అని విశ్లేషకులు ప్రశ్నిస్తూన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే కలిసి కూటమిగా ఉన్నాయి. వారిని కొత్తగా కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అలాగే డీఎంకే కూడా ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సమావేశమై కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు.

dmk stalin

కానీ చంద్రబాబు పని గట్టుకుని ఆయన రాష్ట్రాలకు వెళ్తున్నారు. అయిది వారు బీజేపీకి వ్యతిరేకమైనప్పటికీ విడివిడిగా వ్యతిరేకంగా ఉంటున్న పార్టీలను చంద్రబాబు ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పైగా అందరూ యూపీఏ కూటమిలో భాగస్వామ్యం కావడం లేదు. కొత్తగా సేవ్ నేషన్ కూటమిని పెట్టుకోబోతున్నారు. దీనిలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీనే కానీ అదే మెయిన్ కాదని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఓ దారికి తీసుకు వచ్చి కూటమిగా ఏర్పడేలా చేసి ఆ తర్వాత బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న లేదా న్యూట్రల్ గా కనిపిస్తున్న పార్టీల సంగతి ఆలోచించాలని చంద్రబాబు భావిస్తున్నారని మరో వర్గం భావిస్తోంది. ఈ విషయంలో నవీన్ పట్నాయక్ చంద్రబాబు హిట్ లిస్ట్‌లో మొదటగా ఉన్నారట త్వరలో ఆయనతో భేటీ కానున్నారు. ఆయన భేటీ తర్వాత బాబు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది తేలనుంది.