106 ఏళ్ల బామ్మ కోసం మహేష్‌…!

Mahesh Babu Gesture For 106 Years Old Woman

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన అభిమానులకు ఈమద్య చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ వస్తున్న మహేష్‌ బాబు తాజాగా తనను కలవాలని కలలు కంటూ ఉన్న ఒక 106 ఏళ్ల ముసలి బామ్మను కలిసేందుకు ఓకే చెప్పాడు. అమెరికాలో మహర్షి చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత ఆమెను కలవనున్నట్లుగా సన్నిహితుల ద్వారా ఆమెకు తెలియజేశాడు. త్వరలోనే ఒక తేదీ చెబితే ఆ తేదీన ఆ బామ్మను రాజమండ్రి ఫ్యాన్స్‌ హైదరాబాద్‌ తీసుకు రాబోతున్నారట. చాలా కాలంగా మహేష్‌ బాబుతో ఒక సెల్ఫీ తీసుకోవాలని కలలు కంటూ ఉన్న ఆ బామ్మ కోరికను తీర్చేందుకు మహేష్‌ బాబు త్వరలోనే ఆమెతో సెల్ఫీని తీసుకోబోతున్నట్లుగా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చెబుతున్నారు.

Mahesh Babu

మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం మహర్షిలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను దిల్‌రాజు, అశ్వినీదత్‌, పీవీపీలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు చెందిన షూటింగ్‌కు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఒక విలేజ్‌ సెట్‌ను వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయి మార్కెట్‌ ఉన్న ఈ సినిమాతో మహేష్‌ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.