59 నిమిషాల్లో కోటి లోన్ లో….ఇంత జరిగిందా ?

Get Rs 1 crore loan in 59 minutes In MSME

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు(MSME) పెట్టాలనుకునేవారికి కేవలం 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం మంజూరు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతీ తెలిసిందే. రెండోసారి తీసుకొనే రూ. కోటి రుణంపై రెండు శాతం రాయితీ కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి రూపొందించిన పోర్టల్( (www. psbloanin59minutes.com) ను ఆయన శుక్రవారం(నవంబర్.2) ప్రారంభించారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న MSME లకు కార్మిక నిబంధనల్లో మినహాయింపులు, పర్యావరణ అనుమతులు సులభంగా వచ్చేలా చూడటంతో పాటు కంపెనీల చట్టంలో మార్పు చేస్తామని GST లో నమోదైన కంపెనీలకు కొత్త వెబ్ సైట్ ద్వారా 59 నిమిషాల్లోనే రూ.కోటి లోన్ మంజూరు చేస్తామని ఆయన ఆరోజు చెప్పుకొచ్చారు.

MODI

కంపెనీలకు సంబంధించి చెకింగ్ కు వెళ్లిన 48 గంటల్లోపే అధికారులు ఆ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారని తెలిపారు. 8 కార్మిక చట్టాలు, 10 కేంద్ర నిబంధనలపై ఒకసారి మాత్రమే వార్షిక నివేదిక ఇస్తే చాలన్న మోడీ తాము చేపట్టిన 12 కొత్త సంస్కరణలు చారిత్రాత్మకం అని చెప్పుకొచ్చారు. అయితే అసలు విషయంలోకి వస్తే 59 నిమిషాల లోన్ కోసం మనం అప్లై చేస్తే మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చేది క్యాపిటా వరల్డ్ డాట్ కామ్ అనే సంస్థ ఈ సంస్థ 2015 గుజరాత్ లో రిజిస్టర్ కాబడింది. మార్చి 2017 వరకు ఈ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు సాగించలేదు. సంస్థ ఆదాయం పదిహేను వేలు మాత్రమే.

MSME

ఈ సంస్థ డైరెక్టర్ లు జినంద్ షా వికాస్ షా మరో డైరెక్టర్ వినోద్ మోధ, ఈ వినోద్ మోధా గతం లో అనిల్ అంబానీ కంపెనీ లో కీలక స్థానం లో పని చేశారు. అయితే కాసేపు ఈ డైరెక్టర్ల విషయం కాసేపు పక్కన పెడితే మనం లోన్ కోసం పెట్టే ప్రతి అప్లికేషన్ మీద క్యాపిట వరల్డ్ కంపెనీకి 1180/- రూపాయలు బ్యాంకు వారు ఇవ్వాలి అంతేకాకుండా లోన్ శాంక్షన్ అయితే 0.35% లోన్ అమౌంట్ మీద ప్రాసెసింగ్ ఫీజు కింద ఇవ్వాలి. ఈ సంస్థ ప్రజల నుంచి ఒక రూపాయి తీసుకోకుండా బ్యాంకుల నుంచి మాత్రం పైన చెప్పిన డబ్బులు తీసుకుంటారు. బ్యాంకు వారు ఆ సంస్థకు ఇచ్చిన మొత్తం మన ఖాతాలో నుండే ఇస్తారు కదా అంటే ఇన్ డైరెక్ట్ గా మనమే కడుతున్నాము. అసలు ఒక ప్రైవేట్ సంస్థ అందులోనూ ఇప్పటివరకు ఈ కార్యకలాపాల్లో ఎటువంటి అనుభవం లేని సంస్థ ఇంత పెద్ద కాంట్రాక్టు ఎలా సంపాదించింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎదురవుతున్న ప్రశ్న. ఉదాహరణకు ఒక లక్ష అప్లికేషన్ల వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఈ సంస్థ ఆదాయం ఎంత 100000 X 1180= 118000000 రూపాయలు అన్న మాట. లక్ష అప్లికేషన్ లకే ఇంత అమౌంట్ వస్తుంటే నూటఇరవై కోట్ల మనదేశంలో ఎన్ని కోట్ల అప్లికేషన్లు వస్తాయో మీ ఊహాకే అందట్లేదు కదూ. మరి ఈ సంస్థ వెనుక ఉన్న పెద్దలు ఎవరో ఏమో ?