గేమ్ ఛేంజర్‌ మూవీ లేటెస్ట్ అప్డేట్స్‌ ..!

గేమ్ ఛేంజర్‌ మూవీ లేటెస్ట్ అప్డేట్స్‌ ..!
Cinema News

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈరోజు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ షూటింగ్‌ని తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాంత్, సముద్రఖని, SJ సూర్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న వారిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

 గేమ్ ఛేంజర్‌ మూవీ లేటెస్ట్ అప్డేట్స్‌ ..!
Game Changer

రామ్ చరణ్ త్వరలో షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అంజలి మరియు నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమా కి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబరు లో రిలీజ్ కానుంది.