మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని సంభాల్‌కు చెందిన తను పనినిమిత్తం ఢిల్లీ వచ్చింది.శనివారం ఉదయం కశ్మీరీ గేట్‌కు వెళ్లేందుకు ఖజురిఖాస్‌లో ఆ మహిళ ఐటీఓ ప్రాంతంలో ఆటో ఎక్కింది.
అయితే ఆ సమయంలో ఆటోడ్రైవర్ మహిళ చెప్పిన ప్రదేశానికి కాకుండా యమున బ్రిడ్జి సమీపంలోని ఓ రూమ్‌కు తీసుకువెళ్లి, అక్కడ అతనితో పాటు మరో ముగ్గరు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. అనంతరం తనని ఆ ఆటోడ్రైవర్ కశ్మీరీ గేట్ వద్ద వదిలేసి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరిక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.