బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కొందరు కబ్జాదారులు దాడికి దిగారు. 430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలని, అందుకు సంబంధించిన భూమి వివరాలను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరి ప్రసాద్ .. ఆర్టీఐ ద్వారా అధికారులను వివరాలు కోరారు.
దీంతో కక్ష కట్టిన కబ్జాదారులు హరి ప్రసాద్‌పై ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి తల్లిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు అన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హరి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.