పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులే ముందు రేప్ అన్నారు.. ఇప్పుడు ఆత్మహత్య అంటున్నారని మండిపడ్డారు. నిందితులను తప్పించేందుకు పోలీసులు, ప్రభుత్వంలోని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దిశా కేసు కంటే పెద్దపల్లి బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దారుణంగా జరిగిందన్నారు.
పెద్దపల్లిలో ఓ రియల్టర్, హైదరాబాద్ కి చెందిన ఓ నాయకుడు కలిసి ఒత్తిడి తేవడంతోనే ఈ కేసును చిన్నదిగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం బరితెగించి దుండగులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించే ఒత్తిడి జరుగుతుందన్నారు. ఈ ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తో మాట్లాడతానని.. పోలీస్ అధికారి బలి కాక తప్పదని హెచ్చరించారు.