మహబూబాబాద్ జిల్లా ఆలేరులో దారుణం చోటు చేసుకుంది. మృగాల చేతిలో అఘాయిత్యానికి గురైన ఓ యువతి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది.
నలుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా.. ఎవరితో చెప్పుకోలేక పురుగుల మందు తాగింది బాధితురాలు. విషయం గమనించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూసింది.
సూసైడ్ నోట్‌లో నిందితుల పేర్లను ప్రస్తావించిన బాధితురాలు.. వాళ్లను చెప్పుతో కొట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.