జూదంలో భార్యను పందెంగా పెట్టి ఓడటంతో గ్యాంగ్ రేప్, మళ్లీ మళ్ళీ !

Gang rape with wife in betting on gambling, again and again!

జూదం, తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి ఏకంగా భార్యనే పణంగా పెట్టాడు. బెట్టింగ్‌లో ఓడటంతో.. తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దీంతో వారు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడంతో ఆమె బాధతో మేనమామ ఇంటికెళ్లింది. తన వెనకే వచ్చిన భర్త మన్నించమని వేడుకోవడంతో మనసు మార్చుకొని వచ్చింది.

దార్లోనే కారు ఆపి స్నేహితులను ఎక్కించుకున్న భర్త మరోసారి తన బుద్ధి బయటపెట్టుకోగా అతడి స్నేహితులు మరోసారి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భర్త తీరుతో ఉపేక్షించొద్దని భావించిన బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కానీ ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు.

దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో జఫారాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాగుడుకు బానిసైన తన భర్త జూదం కోసం డబ్బులు లేకపోవడంతో తనను పందెంగా పెట్టాడని బాధితురాలు వాపోయింది.