పోలవరం రివర్స్ టెండరింగ్ కి కేంద్రం మోకాలడ్డు !

Center for Polavaram Rivers Tendering

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ నివేదిక మేరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను పెంచారని జగన్ సర్కారు భావిస్తోంది. కమిటీ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ దిశగా అడుగులేస్తోంది.

పోలవరం టెండర్లను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం పట్ల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు.  ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు 2019’పై టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా శుక్రవారం పార్లమెంట్‌లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.55 వేల కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. గల్లా జయదేవ్ ప్రశ్నల పట్ల స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం కచ్చితంగా పెరుగుతుందన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితంగా చెప్పాలేమన్నారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీని వ్యయాన్ని కేంద్రం భరిస్తోంది. ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు ఖర్చయ్యాయి. రూ.3 వేల కోట్లకు సంబంధించి ఆడిట్ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కొత్తగా టెండర్లను పిలవాలనుకోవడం అవరోధంగా మారింది. దీని వల్ల ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుంద’’ని మంత్రి తెలిపారు.