సంచలనం రేపిన హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం, నల్గొండలో మధ్య వయస్కురాలైన వివాహితపై ఇద్దరి సామూహిక అత్యాచారం, హత్య వంటి ఘటనలు మరవకముందే తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ యువతిని చెరబట్టిన కామాంధులు ఆమెకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
యువతిపై నలుగురు వ్యక్తులు బంధించి మద్యం తాగించిన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో షాక్‌లోకి వెళ్లిపోయిన యువతి ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని, తేరుకున్నాక వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.