ఓటీటీ పార్ట్నర్‌ని ఖరారు చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”!

"Gangs of Godavari" finalizes OTT partner
"Gangs of Godavari" finalizes OTT partner

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా, అంజలి ప్రధాన పాత్రలో నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య రూపొందించారు. మేకర్స్ తమ కాన్ఫిడెన్స్‌తో ఈ చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. ఇప్పుడు, ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ పార్ట్నర్ ఎవరో అనేది ఖరారయ్యింది."Gangs of Godavari" finalizes OTT partnerఈ చిత్రాన్ని దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. థియేట్రికల్ రన్ అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేయగా, హైపర్ ఆది, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.