మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి వంటి ప్రయోగాత్మక సినిమా అనంతరం ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ సినిమా తో వచ్చారు. ఆయన నటించిన ఊరమాస్ సినిమా ఇది. యాక్షన్ ప్రధానంగా సాగుతున్నది . కృష్ణ చైతన్య రూట్ మార్చి ఈ యాక్షన్ సినిమా ని తెరకెక్కించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు గా నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య వాళ్ళు నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. అయితే మూవీ కి మిశ్రమ స్పందన లభించింది.
ఈ క్రమంలో తాజాగా ఫస్డ్ డే కలెక్షన్ల రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నిజాంలో గట్టిగా నే వసూళు చేసింది. ఏకంగా కోటీ పది లక్షలు రాగా, వైజాగ్‌లో 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 28 లక్షలు, వెస్ట్ గోదావరి 24 లక్షలు, గుంటూరు 30 లక్షలు, నెల్లూరు 17 లక్షలు, సీడెడ్ 76 లక్షలు వసూలు ని చేసింది. మొత్తంగా మూడు కోట్ల 32 లక్షల గ్రాస్ ని సాధించింది. కోటీన్నర షేర్ ను సాధించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మూవీ కలెక్షన్లు. ఓవర్సీస్ కలుపుకుంటే నాలుగు కోట్లు దాటిందని చెప్పుకోవచ్చు . విశ్వక్ సేన్ సినిమా కి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.
ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిజినెస్ లెక్కలు చూస్తే, ఈ సినిమా నైజాంలో మూడు కోట్లకి అమ్ముడు పోయింది. ఆంధ్రలో ఐదు కోట్లకి , సీడెడ్‌లో కోటీన్నరకు అమ్ముడు పోయింది. ఓవర్‌సీస్‌లో సుమారు రెండు కోట్లకి అమ్ముడు పోయిందట. ఇలా మొత్తంగా 12కోట్ల వరకు ఈ సినిమా వ్యాపారం జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 24కోట్ల గ్రాస్ రావాలి.