భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ ఇంక ఎడమచేతితో బ్యాటింగ్ చేయగల గంగూలీ అత్యధిక టెస్ట్ విజయాలు సాధించి రికార్డు సృష్టించాడు. బెంగాల్ టైగర్ ఇంకా దాదాగా అని పిలవబడే ఈ ఆటగాడు మరోసారి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహాన్ దాల్మియా చనిపోవడం తో ఖాళీ గా ఉన్న ఈ పదవికి సౌరవ్ గంగూలీని ఎన్నుకున్నారు.
ఎన్నికైన తర్వాత ముందు క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీ మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ పదవి కోసం బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ అధ్యక్ష పదవిపై పోటీపడ్డారు. కాని చివరకి ప్యానల్‌కు పోటీగా కూడా ఎవరూ నామినేషన్ వేయకపోవడం గమనార్హం. ప్యానల్ ఏకగ్రీవంగా ఎంపిక చేయడంవల్ల గంగూలీ బాధ్యత చేపట్టబోతున్నట్లు ప.బె. ముఖ్య మంత్రి మమతా బెనర్జీ తెలిపారు.