ప్రపంచ దేశాలలో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ కు కొవిడ్ 19 కారణంగా ఆగిపోయాయి. కొన్ని రద్దు అయ్యాయి. అయితే భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. అయితే ఇంకా కరోనా వైరస్ ప్రభావం తగ్గక పోవడం తో దీనికి సంబంధించిన ఎటువంటి ప్రకటన యాజమాన్యం తీసుకోలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా, లేదా అన్న ప్రశ్న అటు క్రికెటర్ లను, ఇటు అభిమానులను సందిగ్దానికి గురి చేస్తుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది టీ 20 ప్రపంచ కప్ కి సంబంధించి ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తో సౌరవ్ గంగూలీ ఒక ప్లాన్ వేశారు. ఐపీఎల్ ను నిర్వహించ దానికి కసరత్తు ప్రారంబించింది. ప్రపంచ కప్ జరగాల్సిన సమయం లో ఐపీఎల్ జరిగితే ఎలా ఉంటుంది అంటూ ఒక ప్లాన్ వేసింది బీసీసీఐ. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్దం అని, అందుకు రాష్ట్ర క్రికెట్ బోర్డు లు సిద్దంగా ఉండాలి అని, అసోసియేషన్ లకి సౌరవ్ గంగూలీ ఒక లేఖ రాశారు. ఐపీఎల్ నిర్వహణ కి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖ లో తెలిపారు. వీలైతే ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు సిద్దం కావాలని తెలిపారు.ఆటగాళ్ళు అందరూ సిద్దంగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. దీని పై వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని లేఖలో పేర్కొన్నారు.