జయదేవ్…తెలుగు బులెట్ రివ్యూ.

Ganta Ravi Teja Jayadev Movie Review And Rating In telugu
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యానర్‌: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నటీనటులు: గంటా రవి, మాళవిక రాజ్‌, వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెలకిషోర్‌, హరితేజ, శ్రవణ్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ
మూలకథ: అరుణ్‌కుమార్‌
రచన: పరుచూరి బ్రదర్స్‌
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి
నిర్మాత: కె.అశోక్‌ కుమార్‌
దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ

సినిమా రంగంలోకి రావడం ఎంత కష్టమో కదా. అలాంటిది ఏకంగా హీరోగా రావాలంటే ఇంకా కష్టం. అందుకే పెద్ద పెద్ద సినీ కుటుంబాల నుంచి చిత్రసీమకు వచ్చే వాళ్ళు కూడా ఎంతో హోమ్ వర్క్ చేస్తారు. అయినా వెనుక వున్న ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఏ రెండు మూడు సినిమాలకో పరిమితం. అందుకే కొందరు స్టార్ కుటుంబాల నుంచి వచ్చి కూడా ఈ రంగంలో నిలదొక్కుకోలేకపోతున్నారు. అలాంటిది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు రవితేజ సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన జయదేవ్ తమిళ్ హిట్ సినిమా సేతుపతి కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అక్కడ హిట్ కొట్టిన సేతుపతి ఇక్కడ జయదేవ్ గా ఎలా వున్నాడో చూద్దాం.

కథ…

జయదేవ్ ( గంటా రవితేజ ) నీతి,నిజాయితీ లకి మారుపేరైన ఓ పోలీస్ అధికారి. ACP గా రావాల్సిన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఓ పోలీస్ అధికారి హత్యకేసు ని పరిశోధించాల్సి వస్తుంది. ఆ దర్యాప్తులో హంతకులు పొరపాటున ఆ అధికారిని చంపారని అర్ధం అవుతుంది. నిజానికి వారి టార్గెట్ తమ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న si అని అర్ధం అవుతుంది. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకునేంతలో ఓ విద్యార్థి హత్య జయదేవ్ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అతను పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచే సస్పెండ్ అవుతాడు. ఆ హత్యల వెనుక వున్న బిగ్ షాట్ ఎవరు? జయదేవ్ తిరిగి పోలీస్ శాఖ లోకి వచ్చాడా అన్నది తెలియాలంటే జయదేవ్ చూడాలి.

విశ్లేషణ…

జయదేవ్ పాత్రకి గంటా రవితేజ ఆహార్యం బాగానే సరిపోయింది. కధలో హీరోది తీక్షణత వున్న పాత్ర. ఓ పోలీస్ అధికారికి వుండే బాడీ లాంగ్వేజ్ కూడా భిన్నం గా ఉంటుంది. తొలి సినిమాతోనే ఈ ఛాలెంజ్ తీసుకోడానికి రవితేజ సిద్ధపడటాన్ని అభినందించాల్సిందే. అయితే పోలీస్ పాత్రల్లో టాప్ స్టార్స్ ని చూసాక రవితేజ ని చూస్తుంటే కాస్త ఆగాక ఈ తరహా పాత్రలు ట్రై చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఇంకాస్త అనుభవం వస్తే రవితేజ రాణించే అవకాశం వుంది .ఇక హీరోయిన్ మాళవిక రాజ్, వెన్నెల కిషోర్, పోసాని బాగా చేశారు. శివారెడ్డి,సుప్రీత్ లు కూడా వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నారు.ఇక సేతుపతి లో వున్న ఇంటెన్సిటీ ని తెలుగులో తేవడానికి దర్శకుడు జయంత్ సి.పరాంజీ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. సేతుపతి లో కథ, కథనాల్లో వున్న గ్రిప్ తెలుగులో లేదనిపించింది, దానికన్నా హీరో లాంచింగ్ మీదే దృష్టి ఎక్కువగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. మణిశర్మ పాటలు పర్లేదు అనిపించాయి. సినిమాటోగ్రఫీ , యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ …

వెన్నెల కిషోర్
యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్ …

బోరింగ్ స్క్రీన్ ప్లే

తెలుగు బులెట్ పంచ్ లైన్ … జయదేవ్ ఇంకాస్త కష్టపడాలబ్బా
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .5 /5 .