వైరస్…తెలుగు బులెట్ రివ్యూ.

sampoornesh Babu virus Movie Review And Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిత్రం : వైరస్ 

నటీనటులు : సంపూర్ణేష్ బాబు, గీత షా

దర్శకత్వం : S. R. కృష్ణ 

నిర్మాతలు : సలీం , శ్రీనివాస్ మంగళ 

మ్యూజిక్ డైరెక్టర్ : మీనాక్షి , సునీల్ కశ్యప్ 

విలక్షణ కామెడీతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు మరోసారి వైరస్ అనే డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే టైటిల్ కి తగ్గట్టు సినిమా భిన్నంగా ఉందా లేక సంపూర్ణేష్ బాబు పాత సినిమాల లాగా వైల్డ్ కామెడీ తో నడిచిందా ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే వైరస్ ని రివ్యూ చేయాలి.

కధ…

కేబుల్ టీవీ నడుపుకునే కిట్టు ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ లో ఉంటుంటాడు. అందులో వుండే కొందరి అక్రమసంబంధాల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు లాగేస్తుంటాడు. ఇందుకోసం అతను అక్కడక్కడా సీసీ టీవీ కెమెరాలు అమరుస్తాడు. అందులో కనిపించే దృశ్యాల ఆధారంగా ఓ ఆడపిల్ల ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలుగుతాడు కిట్టు. ఇంతలో ఆ అపార్ట్ మెంట్ లో వుండే రాఘవ రెడ్డి అనే వ్యక్తి చనిపోతాడు. అతన్ని కిట్టు హత్య చేసాడని పోలీసులు నమ్ముతారు. నిజంగా కిట్టు అతన్ని చంపేశాడా? . లేకుంటే ఆ హత్య వెనుక ఎవరున్నారు? ఆ మర్డర్ మిస్టరీ ని ఛేదించడమే వైరస్ మూవీ.

విశ్లేషణ…

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ క్రైమ్ థ్రిల్లర్ తీయాలి అనుకోవడమే భిన్నమైన ఆలోచన. అయితే ఓ అపార్ట్ మెంట్ నేపధ్యాన్ని తీసుకోవడం ద్వారా కామెడీ స్కోప్ పెంచుకున్నాడు దర్శకుడు ఎస్.ఆర్. కృష్ణ. అయితే సంపూర్ణేష్ బాబు ని ఉపయోగించుకోవాలన్న తపనకు తగ్గట్టు సీన్స్ రాసుకోలేకపోయాడు. దీంతో ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొన్ని చోట్ల మాత్రమే పండింది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మర్డర్ మిస్టరీ ని ఛేదించడంలో సస్పెన్స్ ని దర్శకుడు బాగా డీల్ చేసాడు. ట్విస్ట్స్ ని వాడుకోవడం చూస్తే స్క్రీన్ ప్లే పరంగా అతని పట్టు అర్ధం అవుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఎక్కుపెట్టిన అస్త్రంలా ఓ సందేశాన్ని ఈ కధలో దర్శకుడు బాగా ఇమిడ్చాడు. సంపూర్ణేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి లాగానే తనదైన ట్రేడ్ మార్క్ తో సీరియస్ గా కామెడీ చేసాడు. ఇక డాన్స్ ల్లోనూ ఇరగదీసాడు. తన పరిధుల్లో సంపూర్ణేష్ బాగా చేసినా వైవా హర్ష, వెన్నెల కిషోర్ లు అక్కడక్కడా హీరోని తమ నటనతో డామినేట్ చేశారు అనిపిస్తుంది. ఇక కథాపరంగా చూస్తే సమకాలీన సమస్యకి ఓ థ్రిల్లర్ కధలో జోడించడం బాగుంది. కేవలం కామెడీ కోసమే ఈ సినిమా కి వెళితే కొద్దిగా డిసప్పాయింట్ అయినా ఓవరాల్ గా సినిమా ఓకే.

ప్లస్ పాయింట్స్…

సెకండ్ హాఫ్
మర్డర్ మిస్టరీ
సస్పెన్స్
సందేశం

మైనస్ పాయింట్స్ …

కామెడీ ఊహించినంత లేదు
అక్కడక్కడా అతి కామెడీ

తెలుగు బులెట్ పంచ్ లైన్… వైరస్ కాస్త తుస్ కాస్త బుస్
తెలుగు బులెట్ రేటింగ్… 2 .75 / 5.