మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. ఐఎస్ఐఎస్ కశ్మీర్ ఉగ్రవాదుల నుంచి తనకు ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కాగా గంభీర్ ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.