శృతిహాసన్‌కు క్లీన్‌ చీట్‌ ఇచ్చిన గౌతమి

Gautami clarity about Shruti Haasan fighting issue over Sabash Naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌తో సుదీర్ఘ కాలం సహజీవనం సాగించిన గౌతమి హఠాత్తుగా ఆయనతో సంబంధంను కట్‌ చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. కమల్‌తో విడిపోతున్నట్లుగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చి గౌతమి తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. కమల్‌ హాసన్‌తో ఇన్నాళ్లు తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిందని, ఆ విషయాన్ని చెప్పేందుకు తాను ఎంతో సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల కమల్‌తో విడిపోయినట్లుగా చెప్పిన గౌతమి అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు. గౌతమి చెప్పక పోవడంతో సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు రాసేశారు.

shruthi-haasan

కమల్‌ నటిస్తున్న శభాష్‌ నాయుడు సినిమాకు శృతిహాసన్‌ వర్క్‌ చేస్తుంది. ఆ సినిమా సమయంలోనే శృతిహాసన్‌కు గౌతమికి గొడవ వచ్చిందని, ఆ గొడవ కాస్త కమల్‌ వద్దకు వెళ్లడం, కమల్‌ కూతురు శృతిని వెనకేసుకు రావడంతో గౌతమికి కోపం రావడం జరిగిందని, ఆ కారణంగానే కమల్‌ నుండి శృతిహాసన్‌ కారణంగా గౌతమి విడిపోయింది అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా ఆ విషయమై గౌతమి మాట్లాడుతూ శృతిహాసన్‌కు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది.

kamal-haasan-family

కమల్‌ హాసన్‌తో తన జీవితం ప్రారంభం అయిన సమయంలో శృతిహాసన్‌ 17 ఏళ్ల వయస్సు. అప్పటి నుండి తాను శృతిని పెంచాను. సంగీతం నేర్చుకుంటాను అంటే తాను స్వయంగా అమెరికాలో మ్యూజిక్‌ ఇన్సిట్యూట్‌లో జాయిన్‌ చేశాను. శృతితో తనకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. శృతిహాసన్‌ వల్ల విడిపోయాము అనే ప్రచారంలో నిజం లేదు అంటూ గౌతమి చెప్పుకొచ్చింది. అసలు కమల్‌ నుండి విడిపోవడానికి కారణం ఏంటీ మాత్రం గౌతమి చెప్పలేదు. గౌతమి తాజా క్లారిటీతో ఇన్నాళ్లుగా శృతిహాసన్‌ గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.

gouthami-and-shruthi-haasan