Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : మోహన్ బాబు, విష్ణు, శ్రియ , అనసూయ
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం : మదన్
సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురళి
ఎడిటర్ : గౌతమ్ రాజు
మ్యూజిక్ : తమన్
మోహన్‌బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో నటించడంతో పాటు, మంచు విష్ణు మరియు శ్రియలు జోడీగా నటించడం వంటి కారణాల వల్ల సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా ఇటీవలే విడుదలైన ట్రైలర్‌తో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడటం జరిగింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా మదన్‌కు మంచి పేరు ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రా సంఖ్య కొన్నే అయినా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అందుకే మదన్ సినిమా అనగానే గాయత్రిపై సినీ వర్గాల వారు నమ్మకం పెట్టుకున్నారు.
మోహన్‌బాబు చెప్పిన ఒక డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది. రామాయణంలోని అప్పుడు రాముడు చేసింది తప్పు అయితే ఇప్పుడు నేను చేసేది తప్పే అంటూ మోహన్‌బాబు డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో నటించడంతో పాటు, మోహన్‌బాబు యంగ్ ఏజ్ పాత్రను మంచు విష్ణు పోషించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ ఎత్తున ప్రచారం చేయడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. మరి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.