దేశంలోనే మొదటి సారిగా ఉద్యోగులకి జియో ట్యాగింగ్‌ 

Geo tagging for first time employees in the country

డ్యూటీ చేస్తున్నారా, డుమ్మా కొట్టారా.. అసలు డ్యూటీ టైమ్ లో ఎవరెక్కడ ఉన్నారు.. ఇవి నేరుగా తెలుసుకోవటం కష్టమే, ఒక్కో ఉద్యోగికి జియో ట్యాగ్ వేస్తే.. ఇంకేముంది ఫుల్ డాటా రెడీ అవుతోంది.. ఈ ఆలోచన ఆయుష్ డిపార్ట్మెంట్ లో అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు..

అయితే పశువులకు, వాహనాలకు వేసే జియో ట్యాగింగ్ తమకు ఎలా వేస్తారంటూ డాక్టర్లు మండి పడతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఆయుష్‌ విభాగపు వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్‌ చేయాలని ఆ శాఖ కమిషనర్‌ అలుగు వర్షిణి నిర్ణయించారు. ఒక శాఖ సిబ్బందికి జియో ట్యాగింగ్‌ చేయాలని నిర్ణయించడం బహుశా దేశంలోనే ఇదే తొలిసారి.  ఆయుష్‌ వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టకుండా పక్కాగా ఆస్పత్రికి వచ్చేందుకే దీనిని అమలు చేస్తున్నట్లు చెప్తున్నారు..