Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో హిందువుల జనాభా వేగంగా తగ్గుతోంటే… ముస్లింల జనాభా మాత్రం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై అనేక వర్గాల నుంచి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిణామం భారత్ లో హిందువులను మైనార్టీలుగా మార్చివేసే ప్రమాదముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలకడగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో ఎక్కువగా ఉన్న వర్గం సంఖ్య దిగజారినప్పుడు స్థిరత్వం, అభివృద్ధి కూడా కుంటుపడతాయన్నారు.
ఉత్తరప్రదేశ్, అసోం, పశ్చిమబెంగాల్, కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంటే… ముస్లింల సంఖ్య పెరిగిపోతోందని, ఇది దేశ సమగ్రత, ఏకీకృతానికి భంగం కలిగిస్తుందని గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని మతాల వారికి కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ఆయన సూచించారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దేశంలో ప్రస్తుత స్థితిని అద్దం పట్టేవే. అయినప్పటికీ ఆయన బీజేపీ మంత్రి కావడంవల్ల ఆయన వ్యాఖ్యలు… లౌకికవాదులమని చెప్పుకునేవారికి ఆగ్రహం తెప్పించే అవకాశముంది. గిరిరాజ్ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు కొత్త వివాదం సృష్టించనున్నాయి.