నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి వర్షిత నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
అదే హాస్పిటల్‌లో పని చేస్తున్న మధు అనే వ్యక్తి డబ్బుల కోసం వేధించడంతో హాస్టల్‌లో అధికంగా స్టెరాయిడ్‌లు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.