ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బుధవా రం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన బుర్రివార్ గజానంద్– సంగీత దంపతుల కు కూతురు నందిని , కుమారుడు ఉన్నారు. నందిని 10వ తరగతి వరకు బంగారుగూడ మోడల్ స్కూల్‌లో చదివింది.
కరోనా కారణంగా పరీక్షలు రా యకుండానే పదో తరగతి ఉత్తీర్ణులైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో చేరింది. అయితే గత శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా నందిని ఫెయిలైంది. దీంతో అదే రోజు సాయంత్రం ఇంట్లోని వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.