హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మే నెలలో చోటుచేసుకుంది. తాజాగా ఆమెపై అత్యాచారాయత్నానికి పాల్పడిన యువకుడు బాధితురాలికి వాట్సప్ ద్వారా న్యూడ్ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి ద్వారా బాధితురాలికి ముంబైలో పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త రిక్వెస్ట్ చేసింది. ప్రజక్త రిక్వెస్ట్‌ను అంగీకరించిన బాధితురాలు ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. కాగా మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో జుబేర్ అనే మిత్రుడి బర్త్‌డే పార్టీ ఉందని తప్పక రావాలని పేర్కొంది.
కాగా మే11న బాధితురాలితో కలిసి వచ్చిన ప్రజక్త.. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేశారు. అదే రోజు రాత్రి స్వీటీ, జుబేర్‌లు హోటల్‌కు వెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం జుబేర్, ప్రజక్త, స్వీటీలు కలిసి బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్ బాధితురాలిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో స్వీటీతో కలిసి జుబేర్ హోటల్ నుంచి వెళ్లిపోయాడు.