రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు.