ఘట్కేసర్లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓఆర్ఆర్ సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన బాలిక మృతదేహం కాలిన స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతురాలు స్రవంతిగా గుర్తించిన పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా శుక్రవారం అర్థరాత్రి తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు బాలిక తండ్రి పేర్కొన్నారు.