డ్రంక్ అండ్ డ్రైవ్ సిత్రాలు : పోలీసుల కళ్లుగప్పి బట్టలు మార్చేసిన అమ్మాయిలు

Girls escape Drunk and Drive Test through Dress Changes in ATM at Hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తప్ప తాగి వాహనాలు నడిపితే నడిపే వారి ప్రాణాలకే కాక అందులో ఉన్నవారి, రోడ్డు మీద వెళుతున్న వారి ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అందుకే పోలీసులు కూడా ఈ విషయంలో కాస్త కటువుగానే వ్యవహరిస్తుంటారు. అయితే మందు అమ్మారు కాబట్టే తాగాము, తాగినాక ఇంటికి వెళ్ళద్దు అంటారా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులని అడిగిన వారి గురించి అందరు వినే ఉంటారు. అయితే నిన్న జుబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ వద్ద జరిగిన ఓ సంఘటన మాత్రం నభూతో : న భవిష్యత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పీకలదాకా తప్ప తాగి నిర్లక్ష్యంగా కారును నడుపుతూ కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడకుండా బయటపడొచ్చని నిరూపించారు ఇద్దరు యువతులు. వారు తప్పించుకున్న విధానం చూస్తే ఒకవైపు సామాజిక బాధ్యతతో కోఅపం వచ్చినా వారి సమయాస్పూర్తికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతీ వీకెండ్ లాగానే శనివారం రాత్రి కూడా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పోలీసులు బ్లోయర్ టెస్ట్ చేస్తుండగా వారికి దూరంగా ఓ ఖరీదైన కారు ఆగింది. పోలీసులు దగ్గరికి  వెళ్ళినప్పటికి నల్ల టీ షర్టు ధరించిన యువతీ మరో యువతీ కారు దిగి పక్కనే ఉన్న ఏటీఎం వద్దకు పరుగు లంకించుకున్నారు.

అయితే వారిలో డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంది నల్ల టీ షర్టు ధరించిన యువతి అని మాత్రం పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటికి ఏటీఎంలో నుంచి ఇద్దరు యువతులు బయటకు వచ్చారు. అప్పటికే లోపల వారు తమ దుస్తులను పరస్పరం మార్చుకున్నారు. నల్ల టీషర్టు ధరించిన యువతి తన టీషర్టును స్నేహితురాలికి ఇచ్చేసి ఆమె దుస్తులను ఈమె ధరించింది. వాస్తవానికి నల్ల టీషర్టు ధరించిన యువతి పీకలదాకా మద్యం తాగిందట. పోలీసులు ఎదురు పడేప్పటికి తప్పించుకోడానికి ఇలా బట్టలు మార్పిడి కార్యక్రమం చేపట్టారు.

అయితే నడిరోడ్డు మీద కార్ ఎందుకు ఆపారని సదరు యువతులను పోలీసులు ప్రశ్నిస్తుండగానే… ఆ కారు తనదంటూ ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. అతడికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించగా బీఏసీ జీరో వచ్చింది. ఏటీఎంలో దుస్తులు మార్చుకుంటుండగానే తమ స్నేహితుడికి వారు ఫోన్‌ చేసి అక్కడికి పిలిపించుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో నో పార్కింగ్‌ ఏరియాలో కారును ఆపినందుకుగాను కొద్దిపాటి జరిమానా విధించారు పోలీసులు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే… యువతుల నాటకం బయటపడేదని స్థానికులు అనుకోవడం కొసమెరపు.