సూరియా ‘కంగువ’ గ్లింప్స్ కేక పుట్టించేలా… ఫస్ట్ లుక్ విడుదల..

Suriya
Suriya

తమిళ కథ నాయకుడు సూరియా ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఎపిక్ మూవీ కంగువ. ఈ చిత్రం నుంచి నేడు సూరియా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై రౌద్రరసం ఉట్టిపడేలా ఉన్న సూరియా ను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు.

కంగువ…. ఒక నాయకుడు…,ఒక యోధుడు, ఒక రాజు… అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, గ్లింప్స్ ఆఫ్ కంగువ పేరిట వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియోలో వీరోచిత పోరాట దృశ్యాలతో సూరియా కంగువ థీమ్ సాంగ్ వినిపిస్తుండగా, ఈ గ్లింప్స్ సూరియా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

పలు భాషల్లో తెరకెక్కుతున్న కంగువ చిత్రానికి శివ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సూరియా సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.