ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రచారం ప్రస్తుదం దేశంలో హాట్ హాట్‌గా మారింది. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవత్ మాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్ పేరును ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పనాజిలో జరగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఆప్ పోటీ చేస్తుందని వెల్లడించారు. గోవా ప్రజలు ఆప్‌కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే గత ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ సారి ఆప్ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్లో రాష్ట్రాన్ని అభిృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో ఎల్విస్ గొమెస్ నేతృత్వంలో ఆప్ బరిలోకి దిగింది. అయితే ఆయన వివిధ కారణాలతో 2020లో పార్టీని వీడాను. ఈ నేపథ్యంలో ఆప్ ఆద్మీ పార్టీ కొత్త సీఎం అభ్యర్థిని రంగంలోకి దింపింది.