“గోదారి గట్టు సాంగ్: ప్రేక్షకుల మనసులు దోచిన మ్యూజిక్”

"Godari Gattu Song: The Music That Captured the Audience's Hearts"
"Godari Gattu Song: The Music That Captured the Audience's Hearts"

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో ఈ మూవీ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌గా రిలీజ్ అయిన ‘గోదారి గట్టు’ ప్రస్తుతం ట్రెమెండస్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుంది. భాస్కరభట్ట చక్కటి సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో అందించిన మెలోడీ ట్యూ్న్స్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ పాట ప్రేక్షకులకు వెంటనే ఎక్కేసింది. దీనికి తోడు రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాటని పాడటంతో ఆయన వాయిస్ రిఫ్రెషింగ్‌గా ఉండటం కూడా ఈ పాట సక్సె్స్‌కి కారణం అని చెప్పాలి.

"Godari Gattu Song: The Music That Captured the Audience's Hearts"
“Godari Gattu Song: The Music That Captured the Audience’s Hearts”

తాజాగా గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ పాటకు ఏకంగా 10 మిలియన్‌కి పైగా వ్యూస్ దక్కాయి. అంతేగాక, 225K లైక్స్‌తో గోదారి గట్టు సాంగ్ దుమ్ములేపుతుంది . ఈ పాటలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌ల కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందంటూ ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఈ సినిమా ని సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.