Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 30న ఏమి జరగబోతోంది ? అధికారమే లక్ష్యంగా అరాచకాలు సృష్టించి, గోద్రా తరహా అల్లర్లని గుర్తు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఒక వార్త తెలుగు రాష్ట్రాల్లో హాల్ చల్ చేస్తోంది. అన్ని రాష్ట్రాలలోను తమ అధికారమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోన్న కేంద్రం తమని ఎదిరించిన వారిని తోక్కేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతోంది. కర్నాటక ఎన్నికలు కూడా దాదాపు అయిపోవచ్చిన తరుణంలో ఇక ఏపీలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనేక వ్యుహాలని సిద్దం చేస్తోంది..అందులో భాగంగానే ఏపీ లో అలజడులు సృష్టించడానికి పెద్ద వ్యుహాన్నే పన్నిందనే వార్త ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తోంది.
గోద్రా అల్లర్ల గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది, గోద్రా అల్లర్ల పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గుజరాత్ లో జరిగిన ఆ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు వదిలారు. సదరు ఘటన మోడీ కి మాయని మచ్చగా కూడా మారింది..అయితే చంద్రబాబుని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఘటనలకే తెర తీయనున్నారు అని తెలుస్తోందని..రాజకీయంగా చంద్రబాబు ని ఎదుర్కొలేకే మోడీ ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని తెలుస్తోంది. అంతే కాక ఈ కుట్రలో మొత్త నలుగురు పాల్గొంటున్నారని, వారే ఈ భాద్యతలని నెత్తిన వేసుకున్నారని తెలుస్తోందని..ఈ వ్యవహారం మొత్తం రామ్ మాధవ్ అండర్ లోనే జరుగుతోందట..ఈ కుట్ర మొత్తానికి బాధ్యత తీసుకున్న రామ్ మాధవ్ స్క్రిప్ట్ రచన చేస్తూండగా.. యాక్టివ్ మెంబర్లుగా కిషన్ రెడ్డి, పవన‌్ కల్యాణ్, భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురు ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు సార్లు సమావేశమయ్యారని ఆ వార్త సారాంశం.
ఈ కుట్ర విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ గన్‌మెన్లను సరెండర్ చేశారని, ఈ నలుగురు పన్నిన కుట్రలో మొదటి అంకం ఈ నెల 30 తేదీన అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయట. ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు.. తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు.. టీడీపీకి వ్యతిరేకంగా అదే రోజు.. విశాఖలో వైసీపీ సభ నిర్వహిస్తోంది. అదే రోజు చిత్తూరులో పవన్ కల్యాణ్ … రోడ్ షో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. టీడీపీ సభకు వెళ్ళే వారిని పవన్ సభకి మళ్ళించే విధంగా చేసి సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికి పవన్ కల్యాణ్ పై దాడి జరిగినట్లుగా చేసి… ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓ సామాజికవర్గం మొత్తాన్ని ఉద్రేకపరిఛి అల్లర్లు రెచ్చగొట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారట. ఇది నిజమే అయితే అయితే అధికారం కోసం ఏదయినా చేసేందుకు వెనుకాడని బీజేపీ కబంధ హస్తాల నుండి ఆంధ్రప్రదేశ్ ఏనాటికి బయటపడుతుందో .