క్యాబ్ లో ఒంటరిగా వెళ్తున్నారా…ఇది చదవండి !

going-alone-in-the-cab-read-it

అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న విద్యార్థిని క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా ఆమెను మాటల్లో పెట్టి, మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత క్యాబ్‌ లోనే అత్యాచారం చేశాడు. అనంతరం 3 గంటల పాటు క్యాబ్‌ లోనే ఆమెను తిప్పి ఓ పార్కు వద్ద వదిలేసి వెళ్లాడు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ యువతి (21) ఢిల్లీలోని ఎన్‌యూ లో ఫారిన్ లాంగ్వేజ్ కోర్సు నేర్చుకుంటోంది. శుక్రవారం  రాత్రి ఆమె తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది.

అర్ధరాత్రి తర్వాత అక్కడ నుంచి జేఎన్‌యూ హాస్టల్‌కు క్యాబ్‌లో బయలుదేరింది. యువతితో బాగా మాట్లాడిన క్యాబ్ డ్రైవర్ మాటల్లోకి దింపి ఓ పానియాన్నీ ఆఫర్ చేశాడు. ఆ డ్రింక్ తాగగానే ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో అతడు అమెపై వాహనంలోనే తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

అనంతరం ఆమెను దక్షిణ ఢిల్లీలోని ఓ పార్కు వద్ద వదిలేసి వెళ్లాడు. స్పృహ తప్పిపోయిన స్థితిలో ఉన్న యువతిని గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని పరిశీలించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం హాస్టల్‌కు చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. యూనివర్సిటీ సిబ్బంది సాయంతో బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.