తీరప్రాంతంలో పసిడివేట

తీరప్రాంతంలో పసిడివేట

ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో రెండు రోజులుగా పసిడివేట కొనసాగుతోంది. స్థానిక మత్స్యకారులు బుధవారం కూడా తీరంలో బంగారం కోసం జల్లెడపట్టారు. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వెతుకుతున్నారు.

ఇప్పటికే మహిళలకు బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలుతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయి. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్‌ సమయాల్లో బయటపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.