వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. ఒక్కరోజులో 300 రూపాయలకు పైగా పెరిగింది. ఇది ఇలా ఉంటే కేవలం గత వారం రోజుల్లో బంగారం ధర 1,500 రూపాయలకు పైగా పడిపోయింది. బులియన్ జేవెల్లరి మార్కెట్లో ఆగస్టు 5న రూ.48,000గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.300 పెరిగి రూ.46500కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.42,683కు చేరుకుంది.ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగానే పెరిగియాయి.
స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹47,300 నుంచి ₹260 పెరిగి ₹47,560కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹43,350 నుంచి ₹43,600 పెరిగింది. బంగారం పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గిపోయాయి. నేడు కేజీ వెండి ధర రూ.62,773 నుంచి రూ.62,704 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.