వామ్మో….డ్రాయర్ లో బంగారం స్మగ్లింగ్ !

బంగారం స్మగ్లింగ్ చేసే వారు రోజురోజుకు కొత్త ప్లాన్ లు వేస్తున్నారు. గతంలో విదేశాల నుంచి, ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు రైస్ కుక్కర్, మిక్సీలు వంటి వాటిలో దాచిపెట్టి తెచ్చేవారు. అయితే, కస్టమ్స్ అధికారులు వాటిని కూడా వల వేసి మరీ పట్టుకుంటుండడంతో ఇప్పుడు మరింత వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి కొత్త తరహా స్మగ్లింగ్‌ను పోలీసులు గుర్తించారు. దోహా నుంచి వచ్చిన ఓ వ్యక్తి బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి, దాన్ని తన అండర్‌వేర్‌ లో దాచిపెట్టి కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పి బయటకు వెళ్ళబోయాడు. అతడి నడక, వాలకం మీద అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. దీంతో నిందితుడు వద్ద సుమారు 1100 గ్రాముల బంగారం పేస్ట్ బయటపడింది. దీని విలువ సుమారు రూ.39లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారుల అంచనా.