గోల్డెన్ బాబా మృతి… అంత్యక్రియలకు కుటుంబం దూరం

గోల్డెన్ బాబాగా పేరు పొందిన సుధీర్ కుమార్ మక్కర్ ఇకలేరు. అయితే ఉత్తరప్రదేశ్ లోని  ఘజియాబాద్ లో ఉంటున్న ఆయన… ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సుమారు సంవత్సరం నుంచి చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మృతి చెందారు.

కాగా గోల్డెన్ బాబా అంత్యక్రియలకు ఒకరిద్దరు మినహా ఆయన బంధువులు ఎవరూ హాజరుకాలేదు. కరోనా భయంతో అంతిమ సంస్కారాలకు వారు రాలేదు. అయితే ఈ తరుణంలో వీడియో కాల్ ద్వారా ఆయన దహన సంస్కారాలను బంధువులకు చూపించారు. గోల్డెన్ బాబా మరణంతో ఆయన భక్తులు తీవ్ర ఆవేదనకు లోనౌతున్నారు.