బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఎట్టకేలకి వారిని అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోలని నిర్వాహకులు రిలీజ్ చేయడంతో, ఈ షోని ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారా అని అభిమానులు ఏంటో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 నిర్వాహకులు ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ సీజన్ 8 బిగ్ బాస్ షోను సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటలకి గ్రాండ్ లాంచ్‌తో ఆరంభించబోతున్నట్లు వారు ప్రకటించారు. ఇక ఈ సీజన్‌ని కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు . దీంతో బిగ్ బాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎవరెవరు వస్తున్నారనే అంశంపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఇందులో కిరాక్ ఆర్పీ, బర్రెలక్క, సోనియా సింగ్, కుమారి ఆంటీ వంటి పాపులర్ పేర్లు కూడా చాలా ఉన్నాయి. మరి ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెడుతున్నది ఎవరో తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే.
https://www.instagram.com/reel/C-7CxIaPOJ4/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==