మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి తారక్ కెరీర్ లో ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన సోలో మూవీ ఇది కాగా మిక్స్డ్ టాక్ తో కూడా 500 కోట్లకు పైగా భారీ గ్రాస్ ను కొల్లగొట్టి దుమ్ము లేపింది.
అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం చాలా రోజులు నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా దీనిపై ఇపుడు క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు దేవర మూవీ నవంబర్ 8 నుంచే స్ట్రీమింగ్ కి వస్తుంది అని టాక్ ఉన్నది . ఇక అది నిజం చేస్తూ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది.
నెట్ ఫ్లిక్స్ లో దేవర ఈ నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా పొందుపరిచాడు . సో దేవర ఆగమనం ఈ 8 నుంచే అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.